అ ఆ లు రావు అగ్రతాంబూలం కావాల
ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు
ఉ కుండ ఉట్టికెత్తి నేతికుండ నేలను బెట్టినట్లు
ఊగిఊగి ఉయ్యాల ఉన్నచోటికే వస్తుంది
ఋణ శేషం అగ్ని శేషం శత్రు శేషం ఉంచరాదు
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
ఏ కర్రన నిప్పుంటే ఆ కర్రే కాలుతుంది
ఐశ్వర్యానికి అంతంలేదు దారిద్ర్యానికి మొదలు లేదు
ఓంకారములేని మంత్రం అదికారములేని ప్రఙ్ఞ
ఔను కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనటం అంత కష్టం
కంచం అమ్మి మట్టెలు చేయించినట్లు
ఖాజీని పాజి పాజీని ఖాజి చేసేవాండు
గంగలో మునిగినా కాకి హంస అవుతుందా
ఘడియ తీరుబాటు లేదు దమ్మిడీ ఆదాయం లేదు
చంక ఎక్కిన పిల్ల చచ్చినా దిగదు
జగమెరిగిన బ్రాహ్మడికి జందెమేల అన్నాట్ట
టక్కరి బావకు జిత్తులమరదలి సైగ
డంబము ఎప్పుడూ పూవులు పూయుచుండునే గానీ కాయలు కాయదు
ఢిల్లీకి పోయి ఉల్లిగడ్డ తెచ్చినట్లు
త గుద్దకింద నలుపు గురిగింజ కేమితెలుసు
దండులోకి పోతే రెంటిలో ఒకటి
ధనం మాట్లాడుతుంటే సత్యం ఊరకుండిపోవును
నంగనాచి నవ్వు నాలుగంధాల చేటు
పంచాంగం పోగానే నక్షత్రాలు ఊడిపోతాయా
ఫది పణాలకన్నా ఫది ఎకరాలు మేలు
బంకారు పళ్లెరమునకైన గోడ చేర్పు ఉండవ లెను
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
మంగలి గొరిగి నేర్చుకుంటే వైద్యుడు చంపి నేర్చుకుంటాడు
యజమాని చూడని చేను ఎంత పెరిగినా నష్టమే
రంపాన కోసి రాచినకొలది గంధపు చెక్కకు వాసన ఎక్కువ
లంక కాల్చినవాడు రాముడి లెంక
వంకాయ దొంగిలించినవాడు టెంకాయకు రాడా
శంకరా శంకరా అంటే మూతి వంకర పోద్దాన్నట్లు
సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏమవుతుంది
హంస నడకలు రాకపోయె కాకి నడకలు మరచిపోయె