Welcome
code psychology person key construction

తెలుగు

మాతృభాష మన ఉనికి, మన ఆలోచన, మన సమిష్టి చైతన్యం

చరిత్ర

    అనగనగా కృష్ణా, గోదావరి నదుల సమీపాన కొందరు మనుషులు ఒక తెగగా ఏర్పడి ప్రకృతి వనరులని సేకరిస్తూ, అడవి జంతువులని, చేపల్ని వేటాడుతూ మనుగడ సాగించారు. వేటలో, పరికరాల తయ్యారిలో, మనుగడకు సంబంధించిన ఇతరాతర విషయాలలో నేర్చుకున్న మెళుకువలు ఒకరితో ఒకరు, వాళ్ళ పిల్లలతో పంచుకోవటానికి సైగలు, శబ్దాలు, చిత్రాలతో కూడిన ఒక మాధ్యమాన్ని తయ్యారు చేసుకున్నారు. కాలానుగుణంగా ఈ మాధ్యమమే తెలుగు భాషగా అవతరించి వ్యాప్తి చెందినది. భాష, మాధ్యమం అయితే, ఈ ప్రాంతానికి సంబంధించిన భౌగోళిక పరిమితులు, జరిగిన సంఘటనలు, వాటివల్ల ఉత్పన్నమైన వేషధారణ, ఆహారపుటలవాట్లు, నమ్మకాలు, పద్ధతులు తెలుగు సంస్కృతిగా ఆ భాషా మాధ్యమానికి ముడిసరుకు అయినవి.

     ఒక ప్రాణి శరీరంలో DNA ఎలాగైతే భౌతికమైన చరిత్రకి సాక్ష్యమొ, ఒక భాష ఆ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక, సామాజిక సంఘటనలకి ఒక సాక్ష్యం. ఒక భాష అంతరించటం అంటే, ఒక జాతికి సంబంధించిన జ్ఞానం అంతరించటం, కనుక ఒక భాషకి ఊపిరైన రోజువారీ వాడుకని తెలుగుకి అందిస్తూ మన ఉనికిని మనమే కాపాడుకోవాలి.

అక్షర చక్రం

తె

సామెతలు

సాహిత్యం

తెలుగు పదాలు

Loading...